వరద బాధిత కుటుంబాలకు ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ చేయూత
-యువత సేవాభావం కలిగి ఉండాలి.
-బ్లడ్ డోనర్స్ సేవలు బేష్.
-ఏటూరు నాగారం ఏఎస్పి సిరిశెట్టి సంకీర్త్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండలంలోని గుర్రాల బావిలో నివసిస్తున్న 40 కుటుంబాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపు గురై చాలావరకు నష్టపోయారు. ఆ కుటుంబాలను ఆదివారం ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో పరామర్శించి 40 వేల రూపాయల విలువగల నిత్యవసర సరుకులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటూరు నాగారం ఏఎస్పి సంకీర్త్ హాజరై వరద బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు.అనంతరం ఏఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ. ప్రజల కోసం పనిచేయడం కోసమే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని,ప్రజలకు ఏ సమస్య అయినా నేరుగా తమకు తెలియజేయాలని,యువత సేవాభావం కలిగి ఉండాలని అన్నారు.బ్లడ్ డోనర్స్ సేవలు ఇలాగే కొనసాగాలని,బ్లడ్ డోనర్స్ కు మా సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ మండల రాజు, చల్పాక ఎంపీటీసీ కోట నరసింహులు,బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కునూరు మహేష్ గౌడ్, ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్,మెరుగు హరీష్,పెండ్యాల ప్రభాకర్, బండపల్లి సంతోష్,తడక సుమన్,పొట్లూరి విజయభాస్కర్,ఎండి ఖాజా పాషా,ఎండి అజారుద్దీన్, ఖయ్యూం ఖాన్,మల్యాల పవన్,సందీప్,బుక్క గోపి, సాయి వికాస్,పెంచికల లక్ష్మీనారాయణ,ఎండి అజ్మత్ ఖాన్,కురుమ సంతోష్, అల్లంల చంటి యాదవ్,చల్పాక గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ,అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
