మన్యం న్యూస్ గుండాల: మణిపూర్ లో ఆదివాసులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ సోమవారం తుడుం దెబ్బ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మండలంలో సోమవారం పూర్తిస్థాయిలో బందు జరుగుతుందని తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి పూనేం శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రయ్య పేర్కొన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోవింద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతా వెంకటేశ్వర్లు, కుంజ సత్యం తదితరులు పాల్గొన్నారు
