సింగరేణి విద్యా సంస్థల్లో పర్యావరణ కెప్టెన్ల ఎంపిక
– విద్యాసంస్థల్లో పర్యావరణంపై ప్రత్యేక సిలబస్
– పాఠశాల పీఈటి సారథ్యంలో కార్యక్రమాలు
– ఏడాది పొడవునా పర్యావరణ చైతన్య కార్యక్రమాలు
– సంస్థ డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్స్ బలరామ్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
సింగరేణి విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఆరు జిల్లాల్లో నిర్వహిస్తున్న అన్ని కళాశాలలు పాఠశాలల్లో పర్యావరణ అవగాహన చైతన్యం పై ప్రత్యేక సిలబస్ ను బోధించనున్నామని సింగరేణి సంస్థ డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్స్ ఎన్.బలరామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది పొడవున అనేక పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రతి తరగతి నుంచి ఒక చురుకైన విద్యార్థిని పర్యావరణ కెప్టెన్ గా ఎంపిక చేస్తున్నామని పాఠశాల లేదా కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.