మన్యం న్యూస్, పినపాక:
ఆగష్టు 9 న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వాహించాలని ఆదివాసీ ఐక్య వేదిక పినపాక మండల నాయకులు తెలిపారు. ఆదివారం మండలంలోని ఐలాపురం గ్రామంలో సమవేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ, ఐకరాజ్య సమితి ఆదివాసీ లను గుర్తించి ఆగష్టు 9 న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు.సెలవు దినంగా ప్రకటించాలని,ప్రభుత్వం ఆధికారికంగా జరపించాలని , ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలని, అన్నారు. ఆగష్టు 9న జరిగే ఆదివాసీ దినోత్సవాన్ని గ్రామగ్రామాన ఘనంగా నిర్వాహించాలని పిలుపునిచ్చారు.ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు లోని కోమరం భీం విగ్రహం వద్ద, ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుతున్నట్లు ఈ కార్యక్రమానికి ఆదివాసీ నాయకులు, ప్రజలు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు తోలెం శ్రీను, పినపాక ఎంపిపి గుమ్మడి గాంధీ, కన్వీనర్ సోలం అశోక్, కోమరం నాగేంద్ర, ఆదివాసీ అభ్యుదయ సంఘం జిల్లా కార్యదర్శి గోగ్గల రామక్రిష్ణ దోర, సర్పంచ్ లు కలివేటి సునీల్, కోరం జంపన్న,మీడియా స