మన్యం న్యూస్ మణుగూరు: ఆగస్టు 6
మణుగూరు మండల పరిధి లోని ఫైర్ స్టేషన్ బజార్ ఏఐటియుసి సీనియర్ కార్మికులు ఆకుల. రాజేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. రాజేశ్వరరావు దశదిన కర్మ లలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రావులపల్లి రామ్ ప్రసాద్,జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ భాష, శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మీ కుమారి, మణుగూరు మండల పట్టణ కార్యదర్శి మోహన్ రావు,దుర్గి సుధాకర్, అక్కి.నరసింహారావు ఎస్కే సర్వర్,ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్ శివయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.