మన్యం న్యూస్ మణుగూరు: ఆగస్ట్ 06
భారత జాగృతి 17 వ వార్సికోత్సవం సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పవన్ నాయక్ ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదినం సందర్బంగా వారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది. భారత జాగృతి ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా బాల వెలుగు పాఠశాల లో కే కటింగ్ ఏర్పాటు చేసి,అనంతరం 60 మంది విద్యార్థులకు 150 పుస్తకాలు,పెన్నులు,బిస్కెట్లు, చాక్లెట్లు,పంచడం జరిగింది.ఈ సందర్బంగా భారత జాగృతి జిల్లా అధ్యక్షులు పవన్ నాయక్ ప్రతాప్,బిఆర్ఎస్వి నియోజవర్గ అధ్యక్షులు రాహుల్ గౌడ్ మాట్లాడుతూ, స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా, చివరి వరకు పోరాడిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని వారి సేవలను కొనియాడారు.ఆయన రగిలించిన భావజాల వ్యాప్తే నేటి తెలంగాణ సాధ్యపడిందని అన్నారు.2006 లో జయశంకర్ సార్ స్పూర్తితో భారత జాగృతి ని కవితక్క స్థాపించడం జరిగింది అని తెలిపారు.నేటి వరకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కాపాడడంలో ముందుంటుందని అన్నారు. తెలంగాణ యువత కూడా ఆయన కన్న కలల సాధనకై కృషి చేయాలని ఈ సందర్బంగా వారు తెలిపారు. భారత జాగృతి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భరోసా మెంబర్ అమీన్, ప్రిన్సిపాల్ మోహన్,శివ కృష్ణ, ఆదిత్య,సందీప్,భరత్,నితిన్, దుర్గా,చందులాల్,ప్రవీణ్,కార్తీక్, పాండిత్,చింటూ,ఇంజుమాం,వర్ధన్,ప్రణీత్,ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.