మన్యం న్యూస్ హైదరాబాద్: ఆగస్టు 6
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అసెంబ్లీలోని హాల్ లో వారి చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారు అన్నారు.జయశంకర్ సార్ పేరు జిల్లాకు పెట్టడం జరిగింది అని గుర్తుచేశారు. జయశంకర్ సార్ తన జీవితాన్ని కూడా తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ ప్రజల నిత్య స్ఫూర్తి ఆచార్య జయశంకర్ అని వారు తెలిపారు.నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త,తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.