మన్యం న్యూస్ భద్రాచలం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఎ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు సోకాజ్ నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు.ప్రస్తుతం ఈ విషయం ఏజెన్సీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది,అయితే ఈ సంఘటనలో పలువురు ఉద్యోగులు ఐటిడిఏ భద్రాచలం ఆధ్వర్యంలోని గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న 48 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసుల జారీ అయ్యాయి అని విశ్వనియత సమాచారం.48 మంది ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన అంశం శనివారం వెలుగులోకి వచ్చింది,2022-23 విద్యా సంవత్సరంలో పది పరీక్షా ఫలితాలపై పీవో క్షుణ్ణంగా సమీక్షించి ఆ పాఠశాలల్లో 80 శాతం కంటే తక్కువ ఫలితాలను సాధించిన 21 మంది ప్రధానోపాధ్యాయులకు,తమ సబ్జెక్టుల్లో సరైన ప్రగతి సాధించని 27 మంది ఉపాధ్యాయులకు పోస్టల్ ద్వారా నోటీసులు చేరడంతో డీడీ కార్యాలయం ద్వారా పీవోకు వీరు తమ సమాధానాలను అందిస్తున్నారు.వేల రూపాయల జీతాలు పుచ్చుకుంటున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించకపోవడంతోనే నోటీసులు జారీ అయ్యాయని చర్చలు సజావుగానే సాగుతున్నాయి.మరి ఈ ఏడాది 2023-2024 విద్యాభ్యాసం ఎలా ఉంటుందో,మెరుగుపడుతుందో లేదో వేచి చూడాల్సిందే.