మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
రెండు రోజులు నిర్వహించిన న్యాయవాదుల శిక్షణా తరగతులకు అపూర్వ స్పందన లభించిందని అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్ తెలిపారు. జిల్లాలోని వివిధ బార్ అసోసియేషన్ల నుండి 200 మందికి పైగా న్యాయవాదులు ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్నట్లు వివరించారు. ఆదివారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో మరో అతిధి చీఫ్ డిఫెన్స్ లీగల్ కౌన్సిల్ వి.పురుషోత్తంరావు మాట్లాడుతూ శిక్షణ తరగతులు బోధించిన ఐ.ఎల్.పి.ఏ. శిక్షులకు అభినందనలు తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
గద్దర్ మృతికి సంతాపంగాసభలో రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సభలో లక్కీనేని సత్యనారాయణ, ఎస్.భానుప్రియ, పాండురంగ విటల్, గుమాష్టాల సంఘం నాయకులు ఆర్. కృష్ణ, కె. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.