ఢిల్లీ :
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఢిల్లీలో సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీకి మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 కింద మార్చి 24వ తేదీన రాహుల్ అనర్హత వేటుకి గురయ్యారు. రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు తీర్పు పై స్టే విధించడం తో వయనాడ్ ఎంపీగా కొనసాగనున్నారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం సుప్రీంకోర్టు తీర్పుతో లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హత వేటు ఎత్తివేయడంతో రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటుకి హాజరయ్యారు.