UPDATES  

 వాహన దారులపై కొరడా ఝళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.

  • వాహన దారులపై కొరడా ఝళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.
  • పోలీసులకు పట్టుబడ్డ 84 ద్విచక్ర వాహనాలు.
  • వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఏఎస్పి.

మన్యం న్యూస్ భద్రాచలం:- నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై భద్రాచలం ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ వాహనాలను స్వాధీనం చేసుకొని వాహనాలను ట్రాఫిక్ స్టేషన్ కి తరలించి జరిమానా విధిస్తున్నారు.గంజాయి గాళ్ల అలజడి తగ్గేందుకు నూతన ట్రాఫిక్ ఎస్ఐ విసృతంగా తనిఖీ నిర్వహించి ఆ వాహనాలు,వాహనదారుల గత చరిత్ర గురించి ఆరా తీసుస్తున్నారు.అసలు నెంబర్ ప్లేట్‌ లేని వాహన దారులు చెబుతున్న కారణాల్లో వాస్తవం ఎంత…?అవాస్తవం ఎంత….? ఉందనే విషయంపై దృష్టి సారిస్తున్నారు.గత వారం రోజులుగా భద్రాచలంలో నెంబర్ ప్లేట్‌ లేని వాహనాలు,ట్యాంపరింగ్‌ నంబర్‌ కలిగిన వాహనాలు,రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా తాత్కాలిక నెంబర్ తో తిరుగుతున్న వాహనాలను పోలీసులు పట్టుకుంటున్నారు.రెండు వైపులా నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరిగే వాహనదారులు నేరాలు చేసేందుకు ఎక్కువ అవకాశముండటంతో అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తమని హెచ్చరిస్తున్నారు.ఈ క్రమంలో భద్రాచలంలో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ రావు ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న దాదాపు 84 వాహనాలను పట్టుకొని వాటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ నేపథ్యంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహన దారులకు భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పారితోష్ కౌన్సిలింగ్ నిర్వహించారు,నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే మరియు సరైన పత్రాలు లేకుండా తిరిగే,మధ్యం సేవించి తిరిగే వాహనదారులకు దాని వల్ల జరిగే నష్టం గురించి క్లుప్తంగా వివరించారు.పట్టుకున్న అన్ని ద్విచక్ర వాహనాలకు నూతన నంబర్ ప్లేట్లు అమర్పించి,అనంతరం అట్టి వాహనాలను వదిలివేసిన పోలీసులు,నిత్యం ప్రతి రోజూ వాహన తనికీలు జరుగుతునే ఉంటాయి అని,అతివేగ డ్రైవింగ్ పై,నైట్ పెట్రోలింగ్ పై,ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ఆటోలు ఎక్కడబడితే అక్కడ ఆపడంపై,ప్రత్యేక దృష్టి పెట్టి కేసులు నమోదు చేస్తామని ఏఎస్పి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !