పాలేరు నుండి నేనే పోటీ చేస్తా
*ముఖ్యమంత్రి ఆశీర్వాదం నాకే
*పాలేరు నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు నిర్ణయం
*మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:పాలేరు నుండి నేనే పోటీ చేస్తా అని మాజీ మంత్రి, బీ. ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం నేలకొండపల్లిలో జరిగిన ఓసమావేశంలో పై వ్యాఖ్యాలు చేసారు.పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని వారి ఇష్టం మేరకు పోటీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేసానన్నారు. తాను చేపట్టిన వివిధ దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలతో నేడు పాలేరు ధనిక నియోజకవర్గంగా మారిందని తుమ్మల అన్నారు. సీఎం కేసీఆర్, పాలేరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనకు మెండుగా ఉందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆకాంక్ష మేరకు పాలేరు నుండి తప్పక బరిలో దిగుతానని స్పష్టం చేశారు.
