మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వ్యక్తిగత న్యాయవాది గరిక సంపత్ కుమార్ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు, తీన్మార్ మల్లన్న @ చింత పండు నవీన్, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు గంజి రఘు, మొహమ్మద్ ఇబ్రహీంలకు లీగల్ నోటీస్ లు పంపించడం జరిగింది. ఎంతో నిబద్ధతగా పినపాక నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న తన పరువుకు నష్టం కలిగించారని ఈ నేపథ్యంలో వ్యక్తిగత న్యాయవాది గరిక సంపత్ కుమార్ ద్వారా తనపై అసత్య ఆరోపణలతో, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని, బ్లాక్ మెయిల్ పద్ధతిలో, అన్ పార్లమెంటరీ బాషతో తిడుతూ, సంబంధం లేని విషయంలో వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఆయన ఆవేదన వెలుబుచ్చారు. అంతే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వారి టీఆర్పి రేటింగ్ పెంచుకోవడం కోసం చేసి లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఒక గిరిజన ప్రజాప్రతినిధి అయిన నన్ను అసభ్యకరమైన పదజాలాలతో తిడుతూ మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్, క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేసిన ప్రసారాలపై ,అదేవిధంగా తనని చంపడానికి కూడా వెనుకాడము అని బెదిరిస్తూ, నిరాధారమైన ఆరోపణలతో, సమాజంలో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, తనకి వస్తున్నటువంటి ప్రజాదారణని చూసి ఓర్వలేక తన రాజకీయ ప్రత్యర్ధులతో కుమ్మక్కై తప్పుడు ఆరోపణలతో సమాజంలో తనని బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేసిన ప్రసారాలను తొలగించి బేసరత్తుగా లిఖితపూర్వకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పి వారు చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తన న్యాయవాది ద్వారా చట్టపరమైన చర్యలు మహమ్మద్ ఇబ్రహీం , మన తొలి వెలుగు రిపోర్టర్ గంజి రఘు క్యూన్యూస్ రిపోర్టర్ తీన్మార్ మల్లన్నల పై న్యాయస్థానంలో పరువు నష్టం దావా వెయ్యడం జరిగిందన్నారు. గౌరవ న్యాయస్థానం శిక్షించే విధంగా తన న్యాయవాది ద్వారా సంబంధిత యాజమాన్యానికి,మొహమ్మద్ ఇబ్రహీంలకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది రేగా ఒక ప్రకటనలో తెలిపారు.
