మన్యం న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల పండుగకు బీ.ఆర్.ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు,విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం కోరారు. పినపాక నియోజకవర్గానికి తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా వేలకోట్ల రూపాయలతో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తన హయాంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను, పట్టణాలలో, మున్సిపాలిటీలలో,గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు బీ.ఆర్.ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన జోష్యం అని చెప్పారు. ఈ మేరకు ప్రచారానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.
