UPDATES  

 పట్టు పైసలు పదిలపరుచుకోండి,కాంట్రాక్ట్ కార్మికుల పిఎఫ్ పాసుబుక్కుల పంపిణీ -పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్

 

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 9

పట్టు పైసలు పదిలపరుచుకోవాలని పదవీ విరమణ అనంతరం భవిష్యత్ అవసరాలకు అవే ఆసరాగా నిలబడతాయని మణుగూరు ఏరియా పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ అన్నారు.బుధవారం నాడు పీకే ఓసి ప్రాజెక్టు కార్యాలయంలో పీకే ఓసి సంక్షేమ విభాగం వారు ఏర్పాటు చేసిన భారీ యంత్రాల మక్ క్లీనింగ్,వాషింగ్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల 2020-21,21-22 వార్షిక సీఎం పిఎఫ్ పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.భవిష్య నిధి లో జమ చేయటం అంటే ఇంతింతై వటుడింతైనట్లుగా కార్మికుని వాటా సంస్థ జమ చేసే వాటా వడ్డీ కలిపి నిధి జమ అవుతుందని,కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము సీఎంపీఎఫ్ వృధా చేయవద్దని పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కోరారు.కాంటాక్ట్ కార్మికుల పిల్లల చదువులు,తల్లిదండ్రుల బాధ్యతలు గనిలో పనిలో బయట ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి అర్థం అయ్యే రీతిలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పీకే ఓసీ ప్రాజెక్ట్ ఇంజనీర్ జె.వీరభద్రుడు సీనియర్ పిఓ ఎండి మదార్ సాహెబ్,ఐఎఫ్ టియు నాయకులు నాసర్ పాషా,ఏ మంగీ లాల్,పిఎ షాబుద్దీన్, కాంట్రాక్టర్లు దొమ్మేటి రవి,బి కృష్ణ,సూపర్వైజర్ మాలోత్ రవి,ఎం గోపి,ఎం ఉప్పయ్య,వి రాజు,బి కాంతారావు,పి శివకృష్ణ,సామేలు,ప్రసాద్ రాజు నాగేష్,శ్రీనివాస్,తిరుపతి,అశోక్,ఉదయ్,కిరణ్,నరేష్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !