UPDATES  

 ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

  • ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
  • ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవ తో ఆదివాసి జీవితాల్లో మార్పు
  • గూడేలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాటలు
  • పోడు భూములకు పట్టాలు: ఆదివాసి సర్పంచ్ లసంఘం మండల అధ్యక్షులు ఏనిక ప్రసాద్

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 9

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణుగూరు మండలం లోని హనుమాన్ టెంపుల్ వద్ద గల కొమురం భీమ్ విగ్రహానికి మణుగూరు మండల సర్పంచులు ఏనిక ప్రసాద్,బచ్చల భారతి,కొమరం జంపేశ్వరి,కారం ముత్తయ్య, బొగ్గం రజిత,ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా. లు పూలమాల వేసి బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక.ప్రసాద్ మాట్లాడుతూ,నాడు కొమరం భీమ్ ఆదివాసులపై జరుగుతున్న అనేక అరాచకాలను చూసి,చలించి పోరు బాట పట్టారని అన్నారు. కొమరం భీమ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆదివాసి సమాజం ముందుకు నడవాలన్నారు.గత 6 దశాబ్దాలుగా పరిపాలించిన పాలకులు ఆదివాసీ సమాజాన్ని ఓటు బ్యాంకు గా చూశారు తప్ప,అభివృద్ధి కి బాటలు వేసిన దాఖలాలు లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కొమరం భీం నినాదం జల్ జంగిల్ జమీన్ ఆదిలాబాద్ టు అశ్వరావుపేట వరకు అమలు జరుగుతుందని అన్నారు.సీఎం కేసీఆర్ ఏజెన్సీ లో ప్రత్యేకంగా చెరువుల పునరుద్ధరణ,మిషన్ భగీరథ త్రాగు నీరు,త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం,మారుమూల గ్రామా లకు కల్పించడం జరిగిందన్నారు.ప్రభుత్వ విప్ రేగా కాంతరావు చొరవతో మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణం, వంతెనల నిర్మాణం చెప్పట్టి ఆదివాసీ సమాజం కష్టాలను తీర్చారు అన్నారు.కొమరం భీం ఆనాడు ఏ పోడు భూముల కొరకు పోరాటం జరిపారో,నేడు సీఎం కేసీఆర్ అర్హులైన ఆదివాసి పోడు సాగుదారుల కల నెరవేర్చి,వారికి పోడు భూములకు సాగు పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతుబంధు,రైతు బీమా అమలు చేసి ఆదివాసులపై సీఎం కేసీఆర్ కి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తున్నారు అని పేర్కన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గూడేలను పంచాయతీలుగా మార్చి ఆదివాసి సమాజం అభివృద్ధి బాటలు వేశారన్నారు.గత పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాషా,మాజీ ఎంపీటీసీ,వల్లభనేని రమణ, రాజు,గుర్రం వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !