UPDATES  

 9 చెక్ డ్యాంలు…రూ.67.22 కోట్లు మంజూరు

9 చెక్ డ్యాంలు…రూ.67.22 కోట్లు మంజూరు
*పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: జీ.ఓ నెం.20తో పినపాక నియోజకవర్గంలోని 9 చెక్ డ్యాం లకురూ.67.22కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు బుధవారం ఓ ప్రకటన లో తెలిపారు.వివరాలు ఇలా ఉన్నాయి.
1.దున్నపోతు ల వాగు శెట్టిపల్లి వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి రూ.6.5 కోట్లు
2.కిన్నెరసాని నది పై చిన్న వెంకటాపురం వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి రూ.4.74 కోట్లు
3.తొట్టి వాగు పోతిరెడ్డిగూడెం చెక్ డ్యాం నిర్మాణానికి రూ.2కోట్లు
4.కరకగూడెం మండలం కాల్వల నాగారం చెక్ డ్యాం నిర్మాణానికి రూ.15కోట్లు
5.కిన్నెరసాని నది సోంపేల్లి వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. చెక్ డ్యాంల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే రేగా కాంతరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మన్యం న్యూస్ తో మాట్లాడుతూ
డ్యామ్ ల నిర్మాణాలతో అద్భుత ఫలితాలు అందుతాయని, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం జరుగుతుందన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !