లోటారి గండి ప్రాజెక్టుకు ప్రాథమిక అనుమతులు
*ఏజెన్సీ బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు
*విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
పినపాక మండలం తోగ్గూడెం సమీపంలో నిర్మించనున్న లోటారి గండి ప్రాజెక్ట్ కు ప్రభుత్వం నుండి ప్రాథమిక అనుమతులు లభించాయి.ఈ మేరకు విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కి సంబంధించి ఇరిగేషన్ అధికారులు డీ. పీ. ఆర్ సిద్ధం చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కి ఏజెన్సీ పై ఎనలేని ప్రేమ కురిపిస్తు, అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారని రేగా అన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కి రేగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లోటారి గండి నిర్మాణం పూర్తయితే వందలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అ అవడంతో పాటు రెండు పంటలు పండుతాయి అని అన్నారు.