మన్యం న్యూస్,మణుగూరు:
రేగా సోషల్ మీడియా దూకుడు మాములు గా లేదు.ఒక వైపు ప్రభుత్వ పథకాలను వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వివరిస్తూనే,ప్రతిపక్ష పార్టీల తీరును సైతం దుమ్మెత్తి పోస్తున్నారు.పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాల రేగా సోషల్ మీడియా సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న అభివృద్ధి పథకాలను విస్తృతం గా ప్రచారం నిర్వహిస్తున్నారు.అలానే ప్రతిపక్ష పార్టీల లోపాలను ఎత్తిచూపుతున్నారు.గురువారం మణుగూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన అనుకున్నంత మేర విజయవంతం కాకపోవడం, హస్తం టికెట్ ఆశిస్తున్న ముఖ్య నాయకులు తప్ప ఆ పార్టీ కార్యకర్తల నుండీ స్పందన కరువైంది.ఇప్పుడు ఈ చర్చ సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది.