మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో స్టేట్ ఆర్డర్ తీసుకొని ఎమ్మెల్యే హోదాలో కొత్తగూడెంకు వస్తున్న సందర్భంగా ఆయనకు గురువారం బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు స్టే వచ్చాక మొదటిసారి కొత్తగూడెం విచ్చేస్తున్న వనమాకు ముందుగా జూలూరుపాడులో కార్యకర్తలు స్వాగతం పలికి తర్వాత సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద బిఆర్ఎస్ నేతలు పూలదండలు వేసి స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పోస్ట్ ఆఫీస్ సెంటర్ బస్టాండ్ చౌరస్తా సూపర్ బజార్ ఏరియాలో వనమాకు నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి వనమా జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.