UPDATES  

 వరద బాధితుల ముట్టడి

  • వరద బాధితుల ముట్టడి
  • మెరక ప్రాంతంలో ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ధర్నా
  • బాధితుల డిమాండ్లు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన తహసీల్దార్

మన్యం న్యూస్ చర్ల:

చర్ల మండల కేంద్రంలో గోదావరి పరవాక ప్రాంతంలోని ప్రజలకు చర్ల మెరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని వరద బాధిత పోరాట సంఘం ఆధ్వర్యంలో ముంపు బాధితులు ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితుల పోరాట సంఘం అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ చర్ల మండలంలో ప్రతి ఏటా వేలాది కుటుంబాలు గోదావరి ఉధృతికి బలి అవుతున్నారు. ఎంతో కస్టపడి ప్రేమతో కట్టుకున్న ఇల్లు మునిగిపోతున్నాయి. కొన్ని ఇల్లు అందులోని విలువైన వస్తువులు వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి పంటలు మునిగిపోయి నాశనం అవుతున్నాయి. హోరున ప్రవహించే గోదావరిలో పసికందులను వయసుమళ్ళిన పెద్దవారిని తీసుకొని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అధికారుల సహాయంతో పడవల్లో ప్రయాణించి పునరావాస కేంద్రాలకు వలసలకు వెల్లి ప్రాణాలను కాపాడుకోవలసిన దుస్థితి యార్పడుతుంది. ఇది ప్రతీ యాట జరుగుతున్న తంతే కానీ ఇప్పుడు ఇది మరింత ప్రమాదంగా తయారయ్యింది. ఇటీవిల కాలంలో ప్రభుత్వాలు చేపడుతున్న పోలవరం, సీతమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా ఉత్పన్నం అవుతున్న బ్యాక్ వాటర్ ఈ ప్రమాదాన్ని మరింత పెంచింది దానివల్ల ఎన్నడూలేని విధంగా గోదావరి వరద ఉదృతి పెరిగింది. ప్రస్తుతం వర్షాకాలం వచ్చిందంటే మేము భయంభయంగా బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వరదల కారణంగా ప్రతి సంవత్సరం మేము పడుతున్న బాధ తమరికి తెలియనిది కాదు కావున తమరు మా యందు దయవుంచి మా బాధలను అర్థం చేసుకొని చర్ల మండల కేంద్రంలోని మెరక ప్రాంతంలో వరద బాధితులమైన మాకు ఐదు సెంట్ల ఇంటి స్థలంను ఇచ్చి న్యాయం చేయవలసిందిగా కోరారు. రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం ఇవ్వాలని అన్నారు 30 వేల రూపాయల ఆర్ధిక సహకారం అందించాలని అన్నారు. లేని యడల పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు కాలయాపన చెయ్యకుండా వారం రోజుల్లో ఇళ్ల స్థలాలు చూపించాలనీ అన్నారు. ఇంటి జాగలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందనీ వరద బాధితుల పోరాట సంఘం చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి ప్రజాపంథా పార్టీ అండగా ఉంటుందనీ అన్నారు. తప్పకుండా ఇంటి జాగాలు ఇస్తామని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో ఈ కార్యక్రమమును ముగించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మునిగల శివ,  చిమిడి సుజాత, కణితి భాను ప్రకాష్ బోడా సందీప్ చిప్పనపల్లి శ్రీకళ వీరమణి, చల్లా బాలు, సామ్రాజ్యం, నాగరత్నం మనోజ రమాదేవి  పార్టీ వరద బాధిత పోరాటసంఘం కార్యదర్శి కొండా కౌశిక్, ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !