అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు,ఇండ్ల స్థలాలు కేటాయించాలి..
టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి డిమాండ్..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ రెండో విడత అక్రిడేషన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కర్ర అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలం కొత్త మార్కెట్ లోని యూనియన్ కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి సాయి సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఎందరో వర్కింగ్ జర్నలిస్టులు సంవత్సర కాలంగా అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 25వ తారీఖున చర్లలో భద్రాచలం నియోజకవర్గం మహాసభ నిర్వహించాలని అన్నారు. ఈ నెలాఖరు లోగా పాత సభ్యత్వాలను రెన్యువల్ చేసి కొత్త సభ్యత్వాలు చేర్పించాలని అన్నారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వారి పక్షాన నిలబడే ఏకైక జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమేనని ఆయన అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వని పక్షంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పూదోట సూరిబాబు, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన వెంకటేశ్వర్లు, కోశాధికారి హరి నాగవర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.రవికుమార్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కటారి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు బోడ లక్ష్మణ్ రావ్, రాధాకృష్ణ, పుష్ప గిరి, సి హెచ్ మిత్ర, సుమన్, నాగేశ్వరావు లు పాల్గొన్నారు.