జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి
– కలెక్టర్ డాక్టర్ ప్రియాంకకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ వినతి పత్రం
– ఈనెల మూడవ వారంలో సమావేశం నిర్వహించాలని డిపిఆర్ఓకు ఆదేశం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
చాలాకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, రెండవ విడత అక్రిడిటేషన్ల ను నేటికీ అందజేయలేదని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని జర్నలిస్ట్ నాయకులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ నెల మూడవ వారంలో అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని డిపిఆర్ఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. అదేవిధంగా మిగతా సమస్యలను కూడా పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అక్రిడిటేషన్ మెంబర్ కర్ర అనిల్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు, కోశాధికారి దొడ్డి హరినాగవర్మ, స్టేట్ కౌన్సిల్ సభ్యులు కటారి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి సాయి సంపత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, పుష్పగిరి గోపి తదితరులు పాల్గొన్నారు.