మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 11
మణుగూరు ఏరియాలోని పివి కాలనీ సింగరేణి కంపెనీ క్వార్టర్స్ ఎలాట్మెంట్ ప్రక్రియ శుక్రవారం నాడు.పివి కాలనీ కమ్యూనిటీ హాల్ నందు, హౌస్ ఎలట్మెంట్ కమిటి ద్వారా నిర్వహించడం జరిగింది అని డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్ తెలిపారు.ఏరియా సింగరేణి ఉద్యోగులు కుటుంబ సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న క్వార్టర్స్ కు బదులు,పివి కాలని నందు ఖాళీగా ఉన్న ఎంసి క్వార్టర్స్‌ను కేటాయింపు కోరకు 23 క్వార్టర్లకు 12 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు అన్నారు.7 మందికి కేటాయించడం జరిగింది అని తెలిపారు.స్పెషల్ డి,డి,టి క్వార్టర్స్కేటాయింపు కోరకు 37 క్వార్టర్లకు గాను 109 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు అని, స్పెషల్ డి, డి,టి 2 క్వార్టర్స్ 24 మంది క్వార్టర్స్ తీసుకోవడం జరిగింది అన్నారు.ఏరియా జనరల్ మేనేజర్ జి దుర్గం రామ చందర్ ఆదేశాల మేరకు చేంజ్ ఆఫ్ క్వార్టర్స్ కౌన్సిలింగ్ నిర్వహించి సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ను అధికారికంగా కేటాయించడం జరిగిందని,డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం వీసం కృష్ణయ్య,సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్,ఈఈ సివిల్ ఉవిఎస్ఎన్ ప్రవీణ్,యూ నియన్ నాయకులు డి.వీరభద్రం,అస్సిస్టెంట్ స్పొర్ట్స్ సుపర్వైజర్ జాన్ వెస్లీ, జూనియర్ అస్పిస్టెంట్ శైలజ తదితరులు పాల్గొన్నారు.