మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 11
మణుగూరు మండలం.కూనవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ వలస గ్రామం అయిన రేగులగండి లో సీజనల్ వ్యాధులు దృష్ట్యా యంపిహెచ్ సి వైద్యులు డాక్టర్ శివ కుమార్ నేతృత్వంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమనికి స్థానిక సర్పంచ్ ఏనిక ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు.మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని ఆయన సూచించారు.వర్షాకాలంలో మురుగునీరు నిలువలు లేకుండా చూసుకోవాలని,దీని ద్వారా దోమలు వృద్ధి చెందవని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ,ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరికతో వందల కోట్ల రూపాయల వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలు చేప్పట్టి ,ప్రభుత్వ వైద్యులను,ఉద్యోగులను నియమించి ప్రజలకు నిరంతరం ఇరవై నాలుగు గంటలు సేవలందించేందుకు అనేక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తుందని వారు తెలిపారు.ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందాలని సర్పంచ్ ఏనిక ప్రసాద్ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు చేస్తూ,ఉచితంగా లక్షలాది రూపాయల విలువ చేసే ఆపరేషన్లను కూడా ఉచితంగానే ప్రజలకు చేయించడం జరుగుతుందని అన్నారు.మణుగూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించి ప్రతిరోజు నిరంతరం రాత్రనకా,పగలనకా అత్యాధునిక వైద్య సేవలు అందించడం జరుగుతుంది తెలిపారు.ప్రత్యేకంగా డయాలసిస్ పేషెంట్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నామని అన్నారు.గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు మంచి బలవర్ధకమైన పోషకాహారాలు తీసుకుంటూ,ప్రభుత్వ వైద్యులు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ ఏనిక ప్రసాద్ కోరారు.ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం,గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్నారు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలని సర్పంచ్ ఏనిక ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.అనంతరం గ్రామంలో దోమల మందు పిచికారీ కార్యక్రమం నిర్వహించారు.జ్వర పిడితులకు,ఇతర వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వెంకటేశ్వర్లు,రాం ప్రసాద్,లక్ష్మీ,శారద,నీల మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ తదితరులు పాల్గొన్నారు.