మన్యం న్యూస్ ప్రతినిధి: ఆగస్టు 12
గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని లక్షల మంది అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలపై సీఎం కేసీఆర్ స్పందించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టిఎస్ పిఎస్ పి తో చర్చించి పరీక్ష వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని.. మిగతా అన్ని పరీక్షలకు అభ్యర్థులు సిద్ధమయ్యేలా చూడాలని కేసీఆర్ సూచించారు.అని మంత్రి కేటీఆర్ తెలిపారు.