UPDATES  

 గులాబీ “సేవకులకు” రేగా సుధారాణి ఘన నివాళి.

 

-వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు

-అంతిమయాత్రలో నియోజకవర్గ నాయకులు

 

మన్యం న్యూస్ అశ్వాపురం:- మండలంలో డెంగ్యూ జ్వరంతో మరణించిన రేగా కాంతారావు వీరాభిమానులు,గులాబీ “సేవకులకు” రేగా సుధారాణి ఘన నివాళి అర్పించారు.అశ్వాపురం మండల పరిధిలోని చింతిర్యాల గ్రామాల్లో నివసిస్తున్న క్రికెటర్ వెన్న రంజిత్ కుమార్ మరియు నిమ్మల శ్రీను విషపూరితమైన డెంగ్యూ జ్వరానికి బలి అయ్యారు,విరు ఇరువురు ఆస్పత్రులలో చికిత్స పొందుతూ మరణించారు,వీరికి మండల ప్రజలతో పాటు,వారి స్నేహ బృందం మరియు పినపాక నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు రంజిత్ అభిమానులు అశ్వపురం చేరుకొని,నివాళులు అర్పించారు.క్రికెటర్,రేగా కాంతరావు వీరాభిమాని వెన్న రంజిత్ జ్వరంతో బాధపడుతూ మరణించిన విషయం తెలుసుకొని శుక్రవారం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లి రంజిత్ మృతదేహానికి పులమాల వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం కల్పించిన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, అనంతరం వారి సొంత గ్రామంలో వారి స్వగృహానికి వెళ్లి ఇరు పార్థివ దేహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి,అనంతరం అక్కడ గ్రామస్తులతో కలిసి మాట్లాడారు ఒకే గ్రామంలో విష జ్వరంతో ఇద్దరు మరణించడం చాలా బాధాకారం అని తెలియజేస్తూ సంతాపం వ్యక్తపరిచారు,అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనొదైర్యన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియపరిచినారు ఈ కార్యక్రమంలో మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు మరియు అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు,యువజన విభాగం నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !