UPDATES  

 గిరిజన సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్

 

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 13

మణుగూరు మండల పరిధి లోని అశోక్ నగర్ లోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం నందు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టి యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,యువజన నాయకులు కలిసి బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. హాస్టల్ లో జ్వరం తో బాధపడుతున్న విద్యార్థులను ఆర్ఎంపీ డాక్టర్ కోటి ని తీసువచ్చి విద్యార్థులకు పరీక్షలు చేపించారు.ఈ సందర్బంగా సాగర్ యాదవ్ మాట్లాడుతూ,100 పడకల ఆసుపత్రి సూపరిండెంట్ రాంప్రసాద్ ను సంప్రదించి విషయం తెలుపగా,విద్యార్థులు అందరికి రక్త పరీక్షలు చేపిస్తామని,కళ్ళ కలకలు వచ్చిన విద్యార్థులు అందరికీ కూడా ఐ డ్రాప్స్ కూడా ఇస్తాము అని సూపరిండెంట్ రాంప్రసాద్ తెలిపారు అన్నారు.విద్యార్థుల కోరిక మేరకు వారికి ఆడుకోవడానికి 5 వాలిబోల్ కిట్స్ కూడా ఇస్తాము అని, అలాగే వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని విద్యార్థులకు భరోసా కలిప్పించారు.వసతి గృహాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అని, ఎటువంటి ఇబ్బందులూ లేవు అని విద్యార్థులు తెలిపారు అన్నారు.కొత్తగా ప్రారంభించిన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ తమకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, మణుగూరు లో పాలిటెక్నిక్ చదువుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల యువజన నాయకులు సురేష్,సూర్యం, సునీల్ కుమార్,డేగల సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !