UPDATES  

 శ్రావణమాసం బోనాలు

శ్రావణమాసం బోనాలు

ప్రజలను సుఖసంతోషాలతో చల్లంగా చూడు తల్లి:సర్పంచ్ పాయం నర్సింహారావు

మన్యం న్యూస్,కరకగూడెం: ఆగస్టు 13

కరకగూడెం మండల పరిధి లోని చిరమళ్ల పంచాయతీ లో ఆదివారం శ్రావణం మాస బోనాలు అత్యంత ఘనంగా నిర్వహించారు.మహిళలు భక్తిశ్రద్ధలతో మట్టి కుండలను పసుపు కుంకుమలతో అలంకరించి నృత్యాల నడుమ బోనాలను ముత్యాలమ్మ తల్లికి సమర్పించారు.బోనాల ఉత్సవాల్లో చిరమళ్ల సర్పంచ్ పాయం.నర్సింహారావు పాల్గొని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పండుగలు ఉత్సవాలకు ప్రజలు తారతమ్యాలు మరిచి పాల్గొనడం,అభినందనీయమన్నారు.ప్రజలను సుఖ సంతోషాలతో చల్లంగా చూడాలని,రోగాల బారి నుండి ప్రజలను కాపాడాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నట్లు సర్పంచ్ నరసింహారావు మన్యం న్యూస్ కు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !