మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 13
మణుగూరు మండలం లోని శివలింగాపురం సాయిరాం ఫంక్షన్ హాల్ నందు సియూపిఎస్ శివలింగాపురం పాఠశాల నందు 1995 నుండి 2002 వరకు ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం గెట్ టు గెదర్ వేడుక ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ సందర్బంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమం లో విద్య నేర్పినటువంటి గురువులను ముఖ్య అతిథిగా ఆహ్వానించి,వారిని ఘనంగా సత్కరించడం జరిగింది.ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్నిఆనందంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఖాన్,ఇందిరా, ఎస్తేర్న,రమేష్,భార్గవి ఉపాధ్యాయులు,విద్యార్థులు బోశెట్టి రవి ప్రసాద్, కాసుమల్ల లాలయ్య,నాగేశ్వరరావు,మహేష్,అశోక్,రాము,రంజిత్ లక్ష్మి, జయశ్రీ,కృష్ణవేణి,సింధూర తదితరులు పాల్గొన్నారు.