UPDATES  

 నూతన విద్యా విధానం 2020 ను మార్చాలి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రేగళ్ల హరీష్

 

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 14

కేంద్ర ప్రభుత్వం యూనియన్ కేబినెట్ విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ, చేసే దిశగా నూతన విద్యా విధానం 2020 ను రూపొందించి, ఆమోదించిందని ఎస్ఎఫ్ఐ నాయకులు రేగళ్ల హరీష్ అన్నారు.ఈ పాలసీని వ్యతిరేకిస్తూ,విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానం 2020 ప్రతులను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రేగళ్ల హరీష్ మాట్లాడుతూ,ప్రభుత్వం కరోనా మహమ్మారి సమయాన్ని, ప్రజలు వ్యతిరేక విధానాలన్నింటిని అమలు చేయడానికి ఒక సువర్ణ అవకాశంగా ఉపయోగించుకుంది అన్నారు. విద్యా విధానాలను రూపొందించడంలో రాష్ట్రాల యొక్క ప్రాధాన్యతను తగ్గించి,ప్రజాస్వామ్యుతంగా విద్యార్థులను తల్లిదండ్రులను, మేధావులు,శాస్త్రవేత్తలను సంప్రదించకుండా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీ ఆమోదించిందని తెలిపారు.1986 లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం ప్రైవేటీకరణకు ద్వారాలను తెరిచింది అని,ఆ విధానం కొనసాగింపు గా ఈ నూతన విద్యా విధానం 2020 ను తెచ్చారు అన్నారు.విద్య కొరకు కేంద్ర ప్రభుత్వం 10% శాతం,రాష్ట్ర ప్రభుత్వం 30% శాతం బడ్జెట్ ను కేటాయించాల్సి ఉంది అన్నారు.ఈ కేటాయింపులకు సంబంధించి ఏ మాత్రం ఎన్ ఈ పి 2019 లో పేర్కొనలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.శాస్త్రీయ,లౌకిక విద్యా విధానాన్ని పరిరక్షించే విధంగా నూతన విద్యా విధానం 2020 ని సవరించుకోవాలని డిమాండ్ చేస్తూ,విద్యార్థులు, ,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు ప్రజాస్వామ్య ఐక్య ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల పట్టణ నాయకులు మడెం లోకేష్,రాజశేఖర్, వెంకన్న,ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !