మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 14
మణుగూరు మండలం,విప్పల సింగారం గ్రామానికి చెందిన వట్టం శ్రీను ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి దశదినకర్మలకు హాజరై వట్టం శ్రీను చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు,మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్.ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ దైర్యం కల్పించారు.ఈ కార్యక్రమం లో కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,గుండాల మండల అధ్యక్షులు కొడెం ముత్యమచారి,బీసీ సెల్ అధ్యక్షులు సత్యనారాయణ, మండల నాయకులు భువనగిరి శివ,ముక్కెర మధు, తదితరులు పాల్గొన్నారు.