UPDATES  

 గ్రామీణ వైద్యులు ప్రధమ చికిత్స మాత్రమే చేయాలి. * మెడికల్ ఆఫీసర్ సంకీర్తన.

మన్యం న్యూస్,అశ్వాపురం: గ్రామీణ వైద్యులు ప్రధమ చికిత్స మాత్రమే చేయాలని, గ్లూకోజ్ బాటిల్స్, రక్త పరీక్ష టెస్టులు లాంటివి చేయకూదని,పరిమితికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంకీర్తన అన్నారు. సోమవారం ఆమె స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మండల గ్రామీణ వైద్యుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గ్రామీణ వైద్యులు వృత్తిపరమైన సర్టిఫికెట్లు ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో ఉంచుకోవాలన్నారు. గ్రామాలలో జ్వరంతో వచ్చే పేషెంట్లు ను ఎటువంటి చికిత్స చేయకుండా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిఫరీ చేయాలన్నారు. పేషంట్ల వివరాలు ఎప్పటికప్పుడు ఓపి బుక్ లో నమోదు చేసుకోవాలని, ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో అన్ని రికార్డులు, వివరాలు ఉండాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిమితికి మించి వైద్యం చేసినా, అబార్షన్ చేసినా, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు అర్జున్, నాగరాజు, శివ, బోస్, అప్పారావు, రవి, వంశీ, నాగేశ్వరావు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !