మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 14 : గ్రామాల్లోని మినీ, మెయిన్ అంగన్వాడి కేంద్రాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సిడిపిఓ నిర్మలాజ్యోతి అన్నారు. సోమవారం తిప్పనపల్లి, రేపల్లెవాడ, వెంగళరావు కాలనిలో గల అంగన్వాడి కేంద్రాలను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్యలక్ష్మి భోజనం తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలోనే తినేలా చూడాలన్నారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. గ్రామాల్లో నేడు అంగన్వాడి కేంద్రాలు పౌష్టికాహార కేంద్రాలు తయారైనాయన్నారు. గర్భీణీలు, బాలింతలు, చిన్నారులకు తప్పనిసరిగా బొజ్జతాహరం అందించాలన్నారు. బరువు తక్కువ ఉన్న చిన్నారులకు ప్రత్యేకంగా ఆహారాన్ని అందించాలన్నారు. రికార్డులను తప్పనిసరిగా క్రమ పద్ధతిలో రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్యలక్ష్మి భోజనం తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలోనే తినేలా చూడాలన్నారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. గ్రామాల్లో నేడు అంగన్వాడి కేంద్రాలు పౌష్టికాహర కేంద్రాలు తయారైనాయన్నారు. గర్భీణీలు, బాలింతలు, చిన్నారులకు తప్పనిసరిగా పౌష్టికాహరం అందించాలన్నారు. బరువు తక్కువ ఉన్న చిన్నారులకు ప్రత్యేకంగా ఆహారాన్ని అందించాలన్నారు. రికార్డులను తప్పనిసరిగా క్రమ పద్ధతిలో మెయింటెన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఐసిడిఎస్ రాణి, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.