మన్యం న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి:
100 అబద్ధాల బీజేపిఅనే పేరుతో బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం సిద్దం చేసిన సీడి , బుక్లెట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 100 అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు . దేశంలో నానాటికి ముఖ దాడులు పెరుగుతున్నాయని , యావత్ దేశ ప్రజలు క్షణక్షణం భయంతో జీవితాలు వెల్లదీస్తున్నారని ఆయన ఆవేదన వెలుగుచ్చారు . బి ఆర్ ఎస్ తోనే దేశ భవిష్యత్తు మారుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ , ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ , టీ. ఎం. డీ. సీ చైర్మన్ మన్నే క్రిశాంక్ గారు, రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి , టీ ఎస్ టీ ఎస్ చైర్మన్ పాటిమీద జగన్ మోహన్ , బీఅర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి , తదితరులు పాల్గొన్నరు.
