మన్యం న్యూస్, బూర్గంపహాడ్:బూర్గంపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యులై ఉంది మృతి చెందిన రైతులకు జనరల్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.50వేల విలువైన చెక్కులను ఆ సంఘ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు చేతులమీదుగా మృతుల బీ కుటుంబాలకు అందజేశారు. వివిధ కారణాలతో మృతి చెందిన నరసయ్య (సోంపల్లి గ్రామము),ఎడమ బుచ్చమ్మ (ఉప్పుసాక గ్రామము),యారం సత్యమారెడ్డి (లక్ష్మీపురం గ్రామం) కుటుంబ సభ్యులకు చెక్ లుఅందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సీఈవో బత్తిన ప్రసాద్,సంఘ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొనడం జరిగినది.
