కాంతన్న చల్లంగా ఉండాలి
ఎమ్మెల్యే రేగా కు ప్రత్యేక సంప్రదాయ వస్త్రం కట్టిన ఎండి ఆదామ్
మన్యం న్యూస్,గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు మంగళవారం విచ్చేసిన విప్, జిల్లా బీ. ఆర్.ఎస్ అధ్యక్షులు ,ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతికి రేగా వీరాభిమాని, రేగా సోషల్ మీడియా వారియర్ ఎండీ ఆదాం ప్రత్యేక సాంప్రదాయక వస్త్రాన్ని కట్టారు.ఈ సందర్భంగా ఆయన మన్యం న్యూస్ తో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి, పినపాక నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆయుర్ ఆరోగ్యాలతో చల్లగా ఉండి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయాలి అని ఆ దేవుడిని ప్రార్ధించి ప్రత్యేక వస్త్రం రేగా చేతికి కట్టడం జరిగిందన్నారు.
