మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
పోలీసుల మనోభావాలను దెబ్బ తీసేలా విమర్శిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
శాంతభద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బాధ్యతయుతమైన విధులు నిర్వహిస్తున్న పోలీసులను తమ రాజకీయ మెప్పు కోసం
మీడియా సమావేశంలో మాహబుబ్ నగర్
పోలీసులను చులకన చేసి విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
తెలంగాణ పోలీసుల దేశంలోనే మంచి గుర్తింపు సాధిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలప్ ఆధారాభిమానులు పొందుతుంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం,కించపరిచేలా అవాస్తవమైన నిందలు మోపుతూ,విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని ఆలోచించాలన్నారు.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పోలీసులు చట్టానికి,న్యాయ స్థానాలకు లోబడి పనిచేస్తారు.ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని,ఇకనుండైనా పోలీస్ వ్యవస్థను విమర్శించే ప్రక్రియను మానుకోవాలని కోరారు.