మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 15: 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉదయరాఘవేంద్ర జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, ఆ స్వాతంత్ర్య ఫలాలను చిట్టచివరి వ్యక్తి వరకు అమలయ్యే విధంగా నేటి యువత కృషి చేయాలన్నారు. కునారిల్లుతున్న హక్కులను కాపాడుకునేందుకు ప్రజలు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు కూనా చిన్నారావు, జుజ్జారపు రాంబాబు, నార్లపాటి సోమేశ్వరరావు, కూనా దుర్గారావు, మద్దు రవి, గోళ్ళ నవీన్ కుమార్, దాది చంటి, మడకం వెంకన్న బాబు, కేదాసి మంగరాజు, కాండ్రుకోట ఉదయ్, మధు, శివశంకర్, మధు తదితరులు పాల్గొన్నారు.