సుధాకర్ కుటుంబానికి అండగా నిలుస్తాం మెడికల్ జేఏసీ నేతలు
బాధిత కుటుంబానికి రూ.20వేల రూపాయల ఆర్థిక సాయం అందించిన మెడికల్ జేఏసీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు
మన్యం న్యూస్ గుండాల: వైద్య రంగములో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన జవాజి సుధాకర్ కుటుంబానికి అండగా నిలుస్తామని మెడికల్ జేఏసీ జిల్లా చైర్మన్ గొంది వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జేఏసీ తరఫున అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అందవలసిన సహాయాన్ని సకాలంలో అందే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, పెండేకట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.
