మన్యం న్యూస్ గుండాల: ఉత్తమ ప్రతిభకు పురస్కారాన్ని గుండాల మండలానికి చెందిన ఇద్దరు అధికారులు అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్ గా పనిచేస్తున్న ప్రవీణ్ రాజ్, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మనీష్ రెడ్డి ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు
