మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలం తహాసిల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా నక్క రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. గతంలో వీఆర్ఏ గా పినపాక మండలంలో బాధ్యతలు నిర్వహించిన రోశయ్య వీఆర్ఏలకు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించిన నేపథ్యంలో నక్క రోశయ్య పినపాక లోనే రికార్డ్ అసిస్టెంట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గతంలో పనిచేసిన కార్యాలయంలోనే తనకు పదోన్నతి లభించడం చాలా ఆనందంగా ఉందని నక్క రోశయ్య తెలియజేశారు.