మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 15
మణుగూరు మండల పరిధి లోని తెలంగాణ భవన్ నందు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు అధ్వర్యంలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పోశం.నరసింహరావు,సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గోన్నారు.ఈ సంధర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు జాతీయ జెండా ను ఎగురవేశారు.అనంతరం వారు మాట్లాడుతూ,ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా నేడు మనకు స్వాతంత్ర్యం వచ్చింది అన్నారు ఆనాడు స్వతంత్ర పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేసి, స్వాతంత్ర్యం తీసుకొని వచ్చారు అని,వారి త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ కుర్రీ నాగేశ్వరరావు,మణుగూరు పట్టణ అద్యక్షులు అడపా అప్పారావు,మణుగూరు ప్రధాన కార్యదర్శి బోలిశేట్టి నవీన్,సీనియర్ నాయకులు, యాదగిరి గౌడ్,రాంబాబు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.