UPDATES  

 సింగరేణి అధ్వర్యంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 15

77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడు జిఎం కార్యాలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య పాల్గొన్నారు. ముందుగా జాతి పితా గాంధీజీ రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి,జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య మాట్లాడుతూ, 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత జాతి మొత్తానికి గొప్ప పర్వదినమైన స్వాతంత్ర దినోత్సవం మనమందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. దేశ స్వాతంత్ర సాధనంలో ముఖ్య పాత్ర పోషించి మనకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన జాతి పితా మహాత్మా గాంధీజీ, జవాహర్ లాల్ నెహ్రూ,నేతాజీ సుభాష్ చంద్రబోస్,సర్దార్ వల్లభ్ భాయి పటేల్,భగత్ సింగ్,అల్లూరి సీతారామరాజు రాజ్యంగ నిర్మాత డా బి.ఆర్. అంబేడ్కర్ మరెందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో మనకు స్వాతంత్రం వచ్చింది అన్నారు. మనమందరము సమిష్టిగా పని చేసి సంస్థకు అలాగే దేశ ప్రగతికి పునరంకితమై మన దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి పదంలో ప్రపంచ దేశాలలో ఆగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలి అన్నారు.సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని చేయడమే కాకుండా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నిర్మాణంలో అద్భుత ఫలితాలు సాధిస్తూ విజయంతగా ముందుకు సాగుతుంది అన్నారు.ఇదే స్పూర్తితో రికార్డు స్థాయిలో ఉత్పతి సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి, ఏజిఎం సివిల్ వెంకటేశ్వర్లు పిఓ- పికేఓసి టి.లక్ష్మీపతి గౌడ్,పిఓ ఎంఎన్జిఓసి శ్రీ శ్రీనివాస చారి, డిజిఎం పర్సనల్,ఎస్ రమేశ్, డిజిఎం ఐఈడి కే వెంకట్ రావు, డిజిఎం కేసిహెచ్పి మధన్ నాయక్,టిబిజికెఎస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ వి ప్రభాకర రావు,ఇతర యునియన్ నాయకులు, అధికారులు తదతరులు పాల్గోన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !