మన్యం న్యూస్ గుండాల: యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించి ఉన్నత ఉన్నత స్థాయికి రావాలి అని గుండాల సీఐ రవీందర్, ఎస్సై కిన్నర రాజశేఖర్ అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని వెన్నెల బైలు గ్రామంలో పర్యటించి అక్కడి యువతకు వాలీబాల్ కిట్టును అందించారు. అనంతరం సిఐ రవీందర్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. అసాంఘిక శక్తులకు సహకరించకుండా ప్రలోభాలకు గురికాకుండా ఉండాలన్నారు. గ్రామంలోని యువతకు పోలీస్ ఉద్యోగాలు సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాలఎస్సై కిన్నెర రాజశేఖర్, కాచన పల్లి ఎస్సై గిరిధర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
