మన్యం న్యూస్ గుండాల: వరద సహాయ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కొప్పుల ఉపేందర్ ఉత్తమ పోలీస్ అవార్డును మంగళవారం అందుకున్నారు. ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగాకొత్తగూడెం ప్రగతి మైదానలో కానిస్టేబుల్ ఉపేందర్ ఉత్తమఅవార్డును అందుకున్నారు.
