మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 15, మండల పరిధిలోని అనంతారం సబ్ సెంటర్ లో సెకండ్ ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న ఆదివాసి ముద్దుబిడ్డ ముక్తి సావిత్రి కి 2023-24 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ పురస్కారం దక్కింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర చీప్ విప్ రేగ కాంతారావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సావిత్రికి పురస్కారాన్ని అందజేసి అభినందించారు. బెస్ట్ ఏఎన్ఎం అవార్డు అందుకున్న ముక్తి సావిత్రికి ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు, మండల ప్రజలంతా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.