మన్యం న్యూస్ గుండాల: మండల వ్యాప్తంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తాసిల్దార్ కార్యాలయంలో ఎల్ రంగా జెండా ఎగరవేయగా, స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ రవీందర్ జండా ఎగరవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సీతారాములు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషన్ జెండాను ఎగరవేశారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ జాతీయ జెండాను ఎగరవేశారు. వీటితోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పార్టీ ఆఫీసుల ముందు ఆయా పార్టీ ల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
