UPDATES  

 రేగా చేతుల మీదుగా ప్రశంస పత్రాలు మురిసిన అధికారులు సిబ్బంది

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సంక్షేమంపై రేగా కాంతారావు ప్రసంగించిన తర్వాత ఉత్తమ సేవలందించిన అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందించారు. రేగా చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న తర్వాత వారంతా మురిసిపోయారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజ్, జిల్లా సమాచార శాఖ అధికారి శీలం శ్రీనివాస్, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి విద్యాలత, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంజీవరావుతో పాటు తదితరులు ప్రశంస పత్రాలను అందుకున్నారు. ప్రశాంత పత్రాలను తీసుకున్న వారందరినీ రేగా కాంతారావు అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !