- ఉత్తమ అటవీ అధికారిగా తేజస్వి
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం
మన్యం న్యూస్, పినపాక:
ఏడూళ్ళ బయ్యారం అటవీ క్షేత్ర అధికారిగా విధులు నిర్వహిస్తున్న తేజస్వి 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రమును ప్రభుత్వ విప్ రేగాకాంతారావు, కలెక్టర్ ప్రియాంక అల చేతుల మీదుగా అందుకున్నారు.వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేసింది. అటవీ భూముల సంరక్షణ, పోడు భూముల విషయంలో వివాదాలు లేకుండా పూర్తిస్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన అటవీ క్షేత్ర అధికారి తేజస్వి జిల్లాలో మొదటి స్థానంలో నిలవడంతో ఆమెకు ఈ అవార్డు దక్కింది. వృత్తి పట్ల ఆమెకు ఉన్న అంకిత భావం గురించి పలువురు మాట్లాడుకుంటూ అభినందిస్తున్నారు.